---Advertisement---

iBOMMA Ravi bail: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ షాక్ చేసే కండిషన్స్..!

February 17, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్ సహా పలు చిత్ర పరిశ్రమలను వణికించిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) వ్యవస్థాపకుడు రవి(Ravi)కి ఎట్ట‌కేల‌కు కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. అయితే ఇది సాధారణ బెయిల్ కాదు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చర్యలు జరగకుండా ఉండేందుకు న్యాయస్థానం అత్యంత కఠినమైన నిబంధనలు విధించడం సంచలనంగా మారింది.

కోర్టు ఆదేశాల ప్రకారం.. రవి స్వయంగా ఎలాంటి ఇంటర్నెట్ (Internet) సౌకర్యాన్ని ఉపయోగించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వచ్చినా పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించి, విదేశాలకు వెళ్లాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని పేర్కొంది. భద్రతా చర్యల్లో భాగంగా తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని కూడా ఆదేశించింది. ప్ర‌తిరోజూ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజ‌రు కావాల‌ని సూచించింది.

కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించారనే ఆరోపణలపై రవి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుండటంతో, మళ్లీ పైరసీ కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకే కోర్టు ఇలాంటి అరుదైన కఠిన షరతులతో బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment