---Advertisement---

కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా..

March 25, 2026

Summarize with AI

---Advertisement---

కాంగ్రెస్ పార్టీలో (Congress Party) కీలక నేతగా ఉన్న జీవన్‌రెడ్డి పార్టీకి (Jeevan Reddy) రాజీనామా చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తల సమావేశంలో నాలుగు పేజీల రాజీనామా (Resignation) లేఖను విడుదల చేసిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీపై అసంతృప్తి.. రేవంత్‌రెడ్డిపై పోరాటం

తనను నమ్ముకున్న అనుచరులకు సరైన ప్రాధాన్యం, పదవులు లభించకపోతే పార్టీలో కొనసాగడం ఎందుకు అనే ప్రశ్నను జీవన్‌రెడ్డి లేవనెత్తారు. తాను న్యాయవాది అయినప్పటికీ ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో తనను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

గత పదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారికే ప్రాధాన్యం ఇస్తే ఎలా అని ప్రశ్నించిన ఆయన, పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వం మనదనే భావన కలగడం లేదన్నారు. పార్టీ కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు (Defected MLAs) ఉండడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుంటే, ఇక్కడ మాత్రం రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని విమర్శించారు. తనకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, పార్టీ తనను అవమానించే స్థితికి తీసుకెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఎన్నో రాజకీయ పోరాటాలు చేసిన తనకు, ఇప్పుడు రేవంత్‌రెడ్డిపై (Revanth Reddy) కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ తనను అణగదొక్కే ప్రయత్నం చేసిందని, తన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment