---Advertisement---

సింగపూర్ పాడవ్వకపోతే చాలు.. మంత్రుల టూర్‌పై పేర్ని నాని సెటైర్లు!

April 26, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రాభివృద్ధి (State Development) సంగతి పక్కన పెడితే.. సింగపూర్ (Singapore) పాడవ్వకపోతే చాలని ఏపీ మంత్రుల (AP Ministers) బృందం పర్యటనపై మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఘాటు సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధ్యయనం పేరుతో మంత్రులు గత 6 రోజులుగా సింగపూర్ పర్యటన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఈ టూర్‌పై స్పందించిన పేర్ని నాని.. సాగు లేని ప్రాంతానికి వ్యవసాయ శాఖ మంత్రి వెళ్లారంటూ మంత్రి అచ్చెన్నాయుడుపై (Minister Atchannaidu) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోచుకున్న సంపదను దాచుకోవడానికే మంత్రుల సింగపూర్ పర్యటన జరుగుతోందని ఆరోపించారు.

అవినీతి రహిత పాలనకు (Corruption Free Governance) సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్న ఆయన.. గతంలో చంద్రబాబును (Chandrababu) కలిసిన సింగపూర్ మంత్రి (Singapore Minister) తర్వాత జైలుకు(Jail) వెళ్లారని విమర్శించారు.

పేర్ని నాని వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పక్షం ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment