---Advertisement---

తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట.. 2 మంది ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్

April 25, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) కీలక సమయంలో పెద్ద రిలీఫ్ లభించింది. రాష్ట్రంలో 2 మంది ఎమ్మెల్సీల నియామకానికి (MLCs Appointment) గవర్నర్ (Governor) శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఆమోదం తెలిపారు. మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ (Kodandaram) అభ్యర్థిత్వాలకు ఇవాళ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించాలని తెలంగాణ కేబినెట్ గత ఏడాది ఆగస్టు 30న గవర్నర్‌కు ఫైల్ పంపించింది. అయితే అప్పటి నుంచి ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో ఈ ఫైల్‌పై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఏ సభలోనూ ప్రాతినిధ్యం లేకుండానే కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రి అజారుద్దీన్ (Azharuddin), మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలలోపు ఏదైనా సభకు ఎన్నిక కావాల్సిన నిబంధన ఉంది. ఈ గడువు ఏప్రిల్ 30తో ముగియనుండటంతో ఉత్కంఠ నెలకొంది.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్సీల నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇవాళ ఫైల్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది.

త్వరలో దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పరిణామం మంత్రి అజారుద్దీన్‌తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment