---Advertisement---

తిరుమల లడ్డూ మీద ఎక్కువ మాట్లాడకూడదని ఆలోచించాం – సీఎం చంద్రబాబు

February 13, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణంలో తిరుమల (Tirumala) లడ్డూ అంశం (Laddu Issue) తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన కలిగించగా, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. తిరుమల లడ్డూలో పంది కొవ్వు, వెజిటేబుల్ ఆయిల్, బాత్రూం క్లీనర్లు కలిపారని ఆయన చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఈ అంశంపై ఎలాంటి అధికారిక విచారణ పూర్తికాకముందే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇదే విషయంపై చంద్రబాబు గారిని సుప్రీం కోర్టు దర్మాసనం కూడా ప్రశ్నించిన ఉదంతం ఉంది. అయితే సుప్రీం కోర్టు (Supreme Court) పర్యావేక్షణలో జరిగిన దర్యాప్తులో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని సీబీఐ(CBI) స్పష్టం చేసినప్పటికీ, వివాదం చల్లారనీయలేదు రాష్ట్రంలోని అధికార పక్షం.

తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న నాయకత్వం నుండి వచ్చిన ప్రకటనలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపాయని తీవ్ర విమర్శలు వినిపించాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు ‘దేవుని పవిత్రత కోసం లడ్డూ అంశంపై ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాం’ అని చంద్రబాబు గారు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారి తీసింది.

లడ్డూ ప్రసాదం పవిత్రత దెబ్బతినడానికి కేంద్రబిందువుగా వ్యవహరించిన చంద్రబాబు గారిలో ఈ అకస్మాత్తు మార్పుకు కారణం ఏమిటి? కేంద్ర రాజకీయ ఒత్తిళ్లా? లేక డెయిరీ సంస్థలతో ఉన్న వ్యాపార సంబంధాలపై వచ్చిన ఆరోపణల ప్రభావమా? ముఖ్యంగా హెరిటేజ్ మరియు ఇందాపూర్ డైరీల అంశం బయటకు రావడంతోనే ఈ వైఖరిలో మార్పు వచ్చిందా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించిన అంశాల్లో బాధ్యతాయుతమైన ప్రకటనలు చేయడం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల విశ్వాసం, ఆలయ ప్రతిష్ట, ప్రజా నమ్మకాన్ని కాపాడే దిశగా పారదర్శక విచారణలు మరియు స్పష్టమైన ప్రకటనలు మాత్రమే వివాదాలకు ముగింపు పలకగలవని వారు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment