---Advertisement---

టీవీకే మేనిఫెస్టో విడుదల.. ఉచిత సిలిండర్లు, మహిళలకు రూ.2,500 సహా విజయ్ 10 భారీ హామీలు

April 16, 2026

---Advertisement---

తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల వేళ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam – TVK) పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్(Vijay) తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను (Election Manifesto) విడుదల చేశారు. మహిళలు, యువత, రైతులు, మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని సామాజిక భద్రతతో పాటు ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అమలు చేయగల పథకాలతో ముందుకు వస్తున్నామని విజయ్ వెల్లడించారు.

టీవీకే మేనిఫెస్టోలో 10 ప్రధాన హామీలు

  1. 60 ఏళ్లలోపు మహిళా కుటుంబ పెద్దలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం.
  2. ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు.
  3. పేద కుటుంబాల వధువులకు 1 సవరన్ బంగారం, నాణ్యమైన పట్టుచీర అందజేత.
  4. గ్రామీణ, పట్టణ విద్యార్థుల కోసం ఆధునిక వసతులతో ఉచిత వసతి పాఠశాలలు ఏర్పాటు.
  5. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల వరకు వడ్డీ లేని విద్యా రుణాలు.
  6. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని మాదకద్రవ్యాల రహిత తమిళనాడు నిర్మాణం.
  7. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల కవరేజీతో ఆరోగ్య బీమా పథకం.
  8. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4,000, డిప్లొమా పూర్తిచేసిన వారికి రూ.2,500 నిరుద్యోగ భృతి.
  9. రాష్ట్ర యువత కోసం 5 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన.
  10. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల పంట రుణాల పూర్తి మాఫీ, చెరకు రైతులకు టన్నుకు రూ.4,500 కనీస మద్దతు ధర.

సాంప్రదాయ సంక్షేమ పథకాలతో పాటు ఆధునిక ఆర్థిక భద్రతా చర్యలను కలిపి విజయ్ సమతుల్య మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు. ఈ హామీలు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment