---Advertisement---

వైభవ్‌కు బంపర్ ఛాన్స్.. బీసీసీఐ సంచలన నిర్ణయం

April 14, 2026

---Advertisement---

భారత క్రికెట్‌లో (India Cricket) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Suryavanshi) భారీ అవకాశం లభించబోతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్ భారత జట్టులోకి (India Team) ఎంపిక చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఐర్లాండ్ (Ireland) పర్యటన కోసం సెలక్షన్ కమిటీ అతడిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రికార్డులపై కన్నేసిన యువ సంచలనం

బెంచ్ స్ట్రెంత్‌ను (Bench Strength) పరీక్షించే భాగంగా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించిన బోర్డు, ఐర్లాండ్‌తో పాటు జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు కూడా వైభవ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకవేళ అతడు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడితే, 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

ఈ ఐపీఎల్ (IPL) సీజన్‌లో వైభవ్ ప్రదర్శన అద్భుతంగా నిలిచింది. ఆర్‌సీబీపై(RCB) 26 బంతుల్లో 78 పరుగులు, సీఎస్‌కేపై(CSK) 17 బంతుల్లో 52 పరుగులు, ముంబైపై (Mumbai Indians) 14 బంతుల్లో 39 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లు క్రికెట్ దిగ్గజాలను కూడా ఆకట్టుకున్నాయి.

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) వైభవ్‌పై ప్రశంసలు కురిపిస్తూ, అతడు చాలా అరుదైన ప్రతిభ కలిగిన ఆటగాడని తెలిపారు. భారత్(India)తరపున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాలని ఆకాంక్షించారు. మాజీ ఆటగాళ్లు కూడా అతడు అంతర్జాతీయ స్థాయికి సిద్ధంగా ఉన్నాడని అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment