ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆలయాల నిర్వహణ తీరుపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్ (YS Jagan Mohan Reddy), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) వ్యవహారశైలిని తప్పు పడుతూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువైన తిరుమల దేవస్థాన్నానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అలాంటి పవిత్ర బాధ్యతలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి(Devotion), నిబద్ధత (Commitment) కలిగినవారే ఉండాలని స్పష్టం చేశారు.
టీటీడీ ఛైర్మన్ నియామకంపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ఒక బాధిత మహిళ చేసిన ఫిర్యాదును పట్టించుకోకుండా అదే వ్యక్తిని పదవిలో నియమించడం ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్య అని ఆరోపించారు. దేవాలయ పవిత్రత కాపాడాల్సిన బాధ్యతను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మార్చారని విమర్శించారు.
ఇక తిరుమల లడ్డూ ప్రసాదంలో (Tirumala Laddu Prasadam) ఉపయోగించే నెయ్యి (Ghee) నాణ్యత విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని పేర్కొన్నారు. నెయ్యి నాణ్యతపై వచ్చిన అభ్యంతరాలను పట్టించుకోకుండా తిరిగి అదే సరఫరాలను అనుమతించడం జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై దర్యాప్తు సంస్థల ఛార్జిషీట్లలో కూడా స్పష్టమైన వివరాలు ఉన్నాయని తెలిపారు.
అంతేకాకుండా, నెయ్యి కొనుగోలు ధరల విషయంలో రాజకీయ దుమారం రేపుతూ, తనకు అనుబంధంగా ఉన్న సంస్థలకు లాభాలు చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఆలయాల నిర్వహణలో భక్తి, శ్రద్ధ, నిష్ఠతో పాటు పారదర్శకత అత్యవసరమని, అవి లోపించాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కూటమి పాలన తీరుపై కొత్త చర్చకు దారి తీశాయి.






