---Advertisement---

బ్రియాన్ బెన్నెట్ అద్భుత ప్రదర్శన.. జింబాబ్వే సూపర్-8లో దూకుడు!

February 20, 2026

Summarize with AI

---Advertisement---

టీ20 వరల్డ్‌కప్ 2026 లీగ్ (T20 World Cup league)దశ ముగియడంతో శనివారం (ఫిబ్రవరి 21) నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. ఈసారి పసికూన జింబాబ్వే (Zimbabwe) అద్భుత ఆటతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ సూపర్-8కు దూసుకెళ్లింది. బలమైన ఆస్ట్రేలియాను (Australia) ఓడించడం గాలివాటం అనుకున్నవారికి, ఆతిథ్య శ్రీలంకను (Sri Lanka) కూడా చిత్తు చేసి తమ సత్తా చాటింది. ఈ విజయాల్లో యువ బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) కీలక పాత్ర పోషించి టోర్నీలో హాట్ టాపిక్‌గా మారాడు.

మూడు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారైనా ఔట్ కాకుండా బెన్నెట్ 175 పరుగులు నమోదు చేశాడు. ఒమాన్‌పై 48, ఆస్ట్రేలియాపై 64, శ్రీలంకపై 63* రన్స్ చేసి జట్టును విజయాలకు చేరువ చేశాడు. ఒత్తిడిలోనూ కూల్‌గా ఆడుతూ చివరివరకు నిలబడే తీరు అతడిని టోర్నీలో అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకడిగా నిలబెట్టింది. ఇదే ఫామ్ కొనసాగితే జింబాబ్వేకు సెమీస్ దూరం కాదనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment