72వ జాతీయ చలనచిత్ర అవార్డులు-2024ను (72 National Film Awards-2024) అధికారికంగా ప్రకటించారు. మొత్తం 34 భాషల్లో (34 Languages) రూపొందిన సుమారు 400 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ వివిధ విభాగాల్లో విజేతలను ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమాలు(Telugu Movies) కూడా పలు విభాగాల్లో అవార్డులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి.
- జాతీయ ఉత్తమ చిత్రం (బెస్ట్ ఫీచర్ ఫిలిం): ఆర్టికల్ 370 (దర్శకుడు ఆదిత్య సుహాస్)
- జాతీయ ఉత్తమ నటి: యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
- జాతీయ ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్)
- జాతీయ ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ పెరిసామి (అమరన్)
- జాతీయ ఉత్తమ బాలల చిత్రం: చిన్న కథ కాదు (దర్శకుడు నందకిషోర్ ఈమని)
- ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కల్కి 2898 ఏడీ (దర్శకుడు నాగ్ అశ్విన్)
- ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్ళు (దర్శకుడు యదు వంశీ)
- ఉత్తమ మేకప్: రవికుమార్ (కమిటీ కుర్రోళ్ళు)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలే నూర్, శీతల్ శర్మ (పుష్ప 2)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జీహాన్ చౌదరి (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే, డైలాగ్ రచయిత: అట్లూరి వెంకీ (లక్కీ భాస్కర్)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత: సుకుమార్ (పుష్ప 2)
- ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్ (దర్శకుడు తుషార్ హిరానందనీ)
- ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాష్ కుమార్ (అమరన్)
- ఉత్తమ బాల నటుడు: అరుణ్ దేవ్ పోతుల (చిన్న కథ కాదు)
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రాలకు లభించిన ఈ గుర్తింపు సినీ పరిశ్రమకు మరో గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu), కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD), పుష్ప 2(Pushpa 2), లక్కీ భాస్కర్ (Lucky Baskhar) చిత్రాలు పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకోవడం విశేషంగా మారింది.








