రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతూ, వ్యవస్థీకృత సోషల్ మీడియా (Social Media) వేధింపులకు (Harassment) పాల్పడుతున్న తీరుపై సామాజిక వేత్తలు, మేధావుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party), జనసేన పార్టీల (Jana Sena Party) కనుసన్నల్లో జరుగుతున్న ఈ తరహా వ్యవస్థీకృత వ్యక్తిత్వ హననం రాష్ట్రంలో ప్రమాదకర సామాజిక ధోరణిగా మారుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌లను (Task Forces) ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, మరోవైపు అధికార పక్షానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల ద్వారా అసభ్యకర, వ్యక్తిత్వ హననానికి దారితీసే కంటెంట్ ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జూనియర్ ఆర్టిస్ట్ (Junior Artist) సునీల్ రావినూతల (Sunil Ravinuthala) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు డబ్బులు (Money) ఇచ్చి ముందే సిద్ధం చేసిన కంటెంట్‌లో నటింపజేశారని, అందుకు పారితోషికం (Remuneration) తీసుకున్నానని ఆయన వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన నటించిన వీడియోల్లో రాష్ట్ర ప్రతిపక్ష నేతతో పాటు వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని జుగుప్సాకరమైన కంటెంట్, మార్ఫింగ్ వీడియోలు రూపొందించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తరహా చర్యలు రాజకీయ విమర్శల పరిధిని దాటి, డబ్బులు వెచ్చించి వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా మారుతున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం సమాజంలో విద్వేషాన్ని పెంచి ప్రజాస్వామ్య విలువలను (Democratic Values) దెబ్బతీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి సోషల్ మీడియా వేధింపులకు సామాన్యులు, మహిళలు, చిన్నారులు కూడా బలవుతున్న ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. తెనాలికి చెందిన గీతాంజలి(Geethanjali), ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు పొందిన ఆనందాన్ని వ్యక్తం చేసిన తర్వాత టీడీపీ(TDP) వ్యక్తులు చేసిన తీవ్ర ట్రోలింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు అప్పట్లో చర్చకు దారితీశాయి. అలాగే, వైఎస్ జగన్‌పై(YS Jagan) అభిమానాన్ని వ్యక్తం చేసినందుకు ఎనిమిదేళ్ల చిన్నారి వేదికా రెడ్డిని (Vedhika Reddy) లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విషప్రచారం జరిగిందని విమర్శలు వచ్చాయి. ఆమె కుటుంబంపై తప్పుడు ప్రచారం చేసి మానసిక వేదనకు గురిచేశారని ఆరోపించారు.
బెండపూడి ప్రభుత్వ పాఠశాల (Bendapudi Government School) విద్యార్థుల వీడియోలను (Students Videos) వక్రీకరించి ట్రోల్ చేయడం, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేధింపులు ఆపాలని విద్యార్థులు విజ్ఞప్తి చేసినా పరిస్థితి మారలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. తన కుమార్తె మరణానికి న్యాయం కోరుతున్న సుగాలి పార్వతి దేవిపై వ్యక్తిగత దాడులు జరిగాయని, అలాగే ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆంధ్ర పాడ్‌కాస్టర్ విజయ్ కేసరి కుటుంబ సభ్యులు, జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి కుమారుడు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చెందు, ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలంగాణకు చెందిన విద్యార్థిని ఆస్మా వంటి పలువురు కూడా టీడీపీ, జనసేన మద్దతుదార్ల సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే పేరుతో సామాన్యులను, మహిళలను, చిన్నారులను లక్ష్యంగా చేసుకోవడం, డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇంట్లో మహిళలపై(Womens) మార్ఫింగ్ కంటెంట్ (Morphed Content) తయారు చేయించి ప్రచారం చేయడం ప్రజాస్వామ్య సమాజానికి ప్రమాదకరమని మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ అండదండలతో నడుస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ‘డిజిటల్ మాఫియా’పై (Digital Mafia) సమగ్ర దర్యాప్తు జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






