ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల (Elections) సమయంలో ఇచ్చిన హామీలు (Promises) అమలు కాలేదనే అసంతృప్తితో రైతులు(Farmers), కార్మికులు(Workers), ఉద్యోగులు(Employees), విద్యార్థులు(Students), మహిళలు(Womens) సహా అనేక వర్గాలు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు రాజకీయ విమర్శలు, సోషల్ సైన్యంతో జగన్‌పై (YS Jagan) వ్యక్తిత్వ హనన దాడిని కూటమి ఎత్తుగడగా ఎంచుకుందని విమర్శలు పెరుగుతున్నాయి.
రైతు భరోసా (Rythu Bharosa) హామీల అమలు, గిట్టుబాటు ధరలు(Remunerative Prices), పంట రుణాలు (Crop Loans) వంటి అంశాలపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పీఎం-కిసాన్‌కు (PM-Kisan) అదనంగా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన హామీలు పూర్తిగా అమలు కాలేదని ఆరోపిస్తున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పొగాకు రైతులు గిట్టుబాటు ధరల కోసం నిరసనలు చేపడుతుండగా, రాజధాని ఉండవల్లి ప్రాంతంలో పంటలను అధికారులే దగ్గరుండి ధ్వంసం చేశారనే ఆరోపణలు కూడా రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు మున్సిపల్ రంగంలో (Municipal Sector) ప్రైవేటీకరణకు (Privatization) వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నాయి. అంగన్వాడీ ఉద్యోగులు (Anganwadi Workers) వేతనాల పెంపు, సంక్షేమ పథకాల అమలు కోరుతూ నిరసనలు చేపడుతుండగా, విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ (RTC) సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో పథకం కొనసాగింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల పేరుతో కొత్త కంపెనీలకు భారీ ఎత్తున భూముల కేటాయింపులు, విశాఖలో కొండల తవ్వకాలు, పర్యావరణ నష్టం వంటి అంశాలపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
సంక్షేమ పథకాల (Welfare Schemes) అమలులో జాప్యం, “తల్లికి వందనం”(Talliki Vandanam), విద్యా కానుక కిట్లు(Vidya Kanuka), కొత్త పెన్షన్లు (New Pensions) వంటి పథకాల అమలులో ఆలస్యం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోందని కూటమి పార్టీల నాయకులే క్షేత్రస్థాయిలో చెబుతున్న మాట. అమరావతి నిర్మాణ వ్యయాలపై వస్తున్న విమర్శలు, రాజధాని రైతుల భూముల అంశం కూడా వివాదాస్పదంగా మారింది. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాల కల్పనలో పురోగతి కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) నిధుల విడుదలలో జాప్యంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యలు, బీచ్‌లలో మద్యం షాపులకు అనుమతులపై మహిళా సంఘాల అభ్యంతరాలు వంటి పౌర సమస్యలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య ప్రజా సమస్యలపై రాష్ట్రంలో చర్చ జరగకుండా కూటమి ఎత్తుగడలో భాగంగా రాజకీయ ఆరోపణలు, సోషల్ సైన్యంతో (Social Media Army) జగన్‌పై (Jagan) వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని విమర్శకులు అంటున్నారు. అధికార పార్టీ నాయకత్వం ప్రతిపక్ష నేతలపై ఆర్గనైజ్డ్ డిజిటల్ దాడులకు ప్రాధాన్యం ఇస్తోందని వివిధ వర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న క్షేత్రస్థాయి ఆందోళనలు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఎంత దాచాలన్నా దాచలేని పరిస్థితికి తీసుకెళ్లాయని, ప్రభుత్వం దానిని గుర్తించడంలో విఫలమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అకారణంగా జగన్‌ను టార్గెట్ చేయడం మితిమీరిన ధోరణిగా మారిందని, ఇది కూటమికే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.







