---Advertisement---

హోంమంత్రిగా రేవంత్ రాజీనామా చేయాలి.. షాబాద్ హత్యలపై హరీష్ రావు డిమాండ్!

July 11, 2026

Summarize with AI

---Advertisement---

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో (Shabad) జరిగిన 6 మంది హత్యల ఘటనపై బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన సాధారణ హత్య కాదని, ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏకంగా 6 మందిని అత్యంత దారుణంగా హత్య చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు.

పోక్సో కేసులో (POCSO Case) నిందితుడిని సకాలంలో అదుపులోకి తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు మండిపడ్డారు. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ ఘటనకు పూర్తి నైతిక బాధ్యత వహించాలని, వెంటనే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా (Home Minister) రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని, ఒక ఎస్సైను సస్పెండ్ చేసి బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడటం సరైన విధానం కాదన్నారు. మానవత్వం ఉన్న నాయకుడైతే వెంటనే రాజీనామా (Resignation) చేయాలని వ్యాఖ్యానించారు.

శుక్రవారం అర్ధరాత్రి షాబాద్ మండలంలోని దైవాలగూడ (Daivalaguda) గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ (Raj Kumar) ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు తన భార్య సరిత, ఇద్దరు కుమారులు, తనపై పోక్సో కేసు నమోదు చేసిన మైనర్ బాలిక(Minor Girl), ఆమె తల్లి లక్ష్మి(Lakshmi), నానమ్మ రుక్కమ్మలను (Rukkamma) కత్తితో దారుణంగా హత్య (Murder) చేశాడు. ఒక్కసారిగా 6 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.

హత్యలు చేసిన అనంతరం రాజ్‌కుమార్(Raj Kumar) తన తండ్రికి(Father) ఫోన్ చేసి 6 మందిని చంపినట్లు, తాను కూడా చనిపోతున్నట్లు చెప్పడంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్‌కు తరలించారు. తన సొంత భార్య, పిల్లలను కూడా హత్య చేయడం దర్యాప్తు అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment