---Advertisement---

ఉండవల్లి రైతులపై చంద్రబాబు ప్రభుత్వం “రాక్షసకాండ” అంటూ జగన్ ఆగ్రహం

July 11, 2026

Summarize with AI

---Advertisement---

రాజధాని (Capital) అమరావతి (Amaravati) పరిధిలోని ఉండవల్లి (Undavalli) గ్రామంలో సీఆర్డీఏ(CRDA) అధికారులు జేసీబీలతో(JCB Excavators) పొలాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేశారంటూ రైతులు(Farmers) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రైతులను, ముఖ్యంగా మహిళా రైతులను(Women Farmers) బలవంతంగా ఈడ్చుకెళ్లినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనతో రైతులు, పోలీసుల(Police) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఉండవల్లి రైతులపై చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Naidu Government) “రాక్షసకాండ” (Brutal Act) సాగించిందని ఆయన ఆరోపించారు. రైతులు తమ కుటుంబాలకు జీవనాధారమైన భూములను ఇవ్వబోమని స్పష్టంగా చెబుతున్నప్పటికీ, వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా పోలీసు బలగాలను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.

బాధితుల్లో ఎక్కువ మంది సన్నకారు, చిన్నకారు రైతులేనని పేర్కొన్న జగన్, ఆ కొద్దిపాటి భూమే వారి కుటుంబాల జీవనాధారమని అన్నారు. పిల్లల చదువులు(Children’s Education), కుటుంబ పోషణ (Family Livelihood అన్నీ ఆ భూమిపైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొంటూ, “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని రైతులు అడుగుతున్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతు నొక్కుతోందని ఆరోపించారు. ధ్వంసమైన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారని, రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

గతంలోనే రాజధాని పేరుతో వేల ఎకరాలు భూములు సేకరించిన ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం రైతులను ఎందుకు వెంటాడుతోందని జగన్ ప్రశ్నించారు. రైతుల అంగీకారం లేకుండా భూములపై ప్రణాళికలు రూపొందించడం, పూర్తి వివరాలు వెల్లడించకుండా స్వాధీనం చేసుకోవడం న్యాయసమ్మతం కాదని పేర్కొన్నారు.

విజయవాడకు (Vijayawada) అత్యంత సమీపంలో, జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన భూములను తక్కువ విలువలకు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ భూముల అసలు లబ్ధిదారులు రైతులా? లేక అధికార వర్గాలకు చెందిన వ్యక్తులా? అని నిలదీశారు.

రైతుల భూములను బలవంతంగా లాక్కొని వారి జీవితాలను నాశనం చేయాలనే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించిన జగన్(YS Jagan), రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తేనే ప్రభుత్వం తీసుకోవాలని, పోలీసు బలంతో భూములు స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం ఉండవల్లి రైతుల భూముల్లో కొనసాగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలని, ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదని స్పష్టం చేస్తూ, రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ప్రకటించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment