---Advertisement---

Modi-Zuckerberg: మోడీకి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు!

August 5, 2026

Summarize with AI

---Advertisement---

కేంద్ర ప్రభుత్వ (Central Government) హెచ్చరికల తర్వాత ఎట్టకేలకు మెటా (Meta) దిగొచ్చింది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) అధికారికంగా క్షమాపణలు (Apology) తెలిపారు. డీప్‌ఫేక్‌లు(Deepfakes), కంటెంట్ నిర్వహణలో (Content Management) జరిగిన లోపాలు, బాలల లైంగిక వేధింపుల కంటెంట్ (CSAM) వంటి అంశాలపై విచారం వ్యక్తం చేస్తూ సంస్థ తరఫున క్షమాపణ చెప్పారు. అయితే ఈ క్షమాపణలు ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీకి (PM Narendra Modi) కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవిగా భావిస్తున్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ యువతను ఉద్దేశించి చేసిన ‘జెన్-జీ అవుట్‌రీచ్’(Gen-Z Outreach) ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో (Facebook) పోస్ట్ చేయగా, అది అనూహ్యంగా తొలగించబడింది. దీనిపై మెటా సాంకేతిక లోపం కారణంగానే వీడియో డిలీట్ (Deleted) అయిందని వివరణ ఇచ్చింది. అయితే ఆ వివరణపై పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం (Parliamentary IT Standing Committee) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే మెటాకు ఉన్న చట్టపరమైన రక్షణను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని కమిటీ హెచ్చరించినట్లు సమాచారం.

కేంద్రం నుంచి వచ్చిన ఈ హెచ్చరికల నేపథ్యంలో మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో డీప్‌ఫేక్‌లు, సీఎస్‌ఏఎం కంటెంట్, అల్గారిథమ్ నిర్వహణలో జరిగిన లోపాలపై విచారం వ్యక్తం చేశారు. అలాగే కొన్ని రకాల కంటెంట్‌ను ప్రోత్సహించేందుకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగిన విషయాన్ని కూడా కంపెనీ అంగీకరించినట్లు సమాచారం.

దర్యాప్తు, సమీక్ష సందర్భంగా ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని కంటెంట్‌లకు ప్రాధాన్యం కల్పించేందుకు భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు మెటా అంగీకరించిందని వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అధికారుల అభిప్రాయం ప్రకారం మెటా వంటి సోషల్ మీడియా సంస్థలు కేవలం తటస్థ మధ్యవర్తులు కావు. ఏ వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలనే నిర్ణయాన్ని ఆయా సంస్థలే తీసుకుంటాయి. అందువల్ల ఐటీ చట్టం కింద లభించే ‘సేఫ్ హార్బర్’ (Safe Harbour రక్షణకు ఇవి అర్హత పొందవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment