---Advertisement---

SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు..!

August 11, 2026

Summarize with AI

---Advertisement---

ప్రముఖ నటుడు, రాజకీయ నేత ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఓటును ఎస్ఐఆర్ ప్రక్రియలో (SIR Process) భాగంగా అధికారులు తొలగించారు. ఆయనకు ఇప్పటికే 4 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బెంగళూరులోని ఆయన ఓటును (Vote) ఎన్నికల సంఘం(Election Commission) తొలగించింది.

బెంగళూరు(Bengaluru) ఓటర్ల జాబితా (Voters List) నుంచి తన పేరు తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం బెంగళూరు నియోజకవర్గంలో దాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని, అందులో తన పేరు కూడా ఉందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

తాను బెంగళూరులోనే పుట్టి పెరిగానని, అక్కడే విద్యాభ్యాసం (Education) పూర్తి చేయడంతో పాటు తన నాటక రంగ ప్రయాణాన్ని కూడా ప్రారంభించానని ప్రకాష్ రాజ్ (Prakash Raj) తెలిపారు. అదే నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా (MP Candidate) పోటీ చేసిన తన ఓటు హక్కును తొలగించడం విడ్డూరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓట్లను తొలగించడం ద్వారా తమను అడ్డుకోగలమని భావిస్తున్నారా అంటూ ప్రధాని మోదీని (PM Modi) ఉద్దేశించి ప్రకాష్ రాజ్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల పేర్లు తొలగించినంత మాత్రాన ప్రజలు తమను అధికారంలో నుంచి దించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

మరోవైపు ఝార్ఖండ్ రాజధాని (Jharkhand Capital) రాంచీలో (Ranchi) అసెంబ్లీ సమీపంలో నిరసన చేపట్టిన జేపీఎస్సీ(JPSC), జేఎస్‌ఎస్‌సీ(JSSC) అభ్యర్థులపై పోలీసులు కన్నీటి వాయువు, లాఠీచార్జ్ ప్రయోగించడాన్ని కూడా ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. నిరసన ప్రాంతానికి సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, ఇలాంటి క్రూరత్వాన్ని ఇకపై సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేపీఎస్సీ-జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు నీటి ఫిరంగులు, లాఠీలతో అడ్డుకున్నారు. జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పోటీ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ (CBI Investigation) జరిపించాలని, నియామక ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు పారదర్శకతను పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థులు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆమోదించకపోవడంతో ఆందోళన మరింత ఉద్ధృతమైంది. ఈ పరిణామాలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment