హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో (Hyderabad Central University – HCU) గంజాయి వ్యవహారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీమ్(Eagle Team) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలువురు విద్యార్థులు గంజాయి వినియోగించినట్లు గుర్తించారు. డ్రగ్ టెస్టుల్లో(Drug Tests) మొత్తం 17 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది.
ఈ వ్యవహారానికి సంబంధించి గంజాయి (Ganja) విక్రయిస్తున్న హెచ్‌సీయూ పూర్వ విద్యార్థిని అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీమ్‌కు అందిన సమాచారంతో యూనివర్సిటీ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలిన 17 మంది విద్యార్థుల నుంచి అధికారులు గంజాయి వినియోగానికి సంబంధించిన వివరాలను సేకరించారు. విద్యార్థులకు గంజాయి ఎలా చేరుతోంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
విచారణలో అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసిన హెచ్‌సీయూ పూర్వ విద్యార్థిని అధికారులు విచారిస్తున్నారు.
అతడికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు ఎవరు, వారి వెనుక ఉన్న నెట్వర్క్ ఏంటి అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు (Students) గంజాయి సరఫరా చేస్తున్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.







కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..!