---Advertisement---

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై కుట్ర.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు!

August 17, 2026

Summarize with AI

---Advertisement---

కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీముబారక్ (Shaadi Mubarak) పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కావాలనే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) నేత హరీశ్‌రావు ఆరోపించారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలను కూడా కొనసాగించామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్(KCR) పేరు ఉండకూడదనే ఉద్దేశంతో పలు పథకాలను (Schemes) తొలగిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతుబీమా (Rythu Bima) పథకాన్ని తొలగించారని అన్నారు. రైతుబీమా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

1999లోనే ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని (Land Ceiling Act) రద్దు చేశారని హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం 22ఏ కింద పెద్దఎత్తున భూములను పెట్టి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. సరూర్‌నగర్, కొండాపూర్, మాదాపూర్, శ్రీనగర్ కాలనీల్లోని భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు.

ఇన్ని లక్షల ఎకరాల భూములను ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారని హరీశ్‌రావు(Harish Rao) ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇల్లు కూడా నిషేధిత జాబితాలోకి వచ్చిందని, తన వరకు పరిస్థితి వచ్చిన తర్వాతే సమస్య తీవ్రత అర్థమైనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు నిషేధిత జాబితాలో ఉండటంతోనే ఆ భూములను తొలగించేందుకు హడావుడి చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలంటే కమీషన్లు అడుగుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రెవెన్యూ శాఖలో (Revenue Department) ఏ పని చేయాలన్నా 30 శాతం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.

నిషేధిత భూములపై (Prohibited Lands) ప్రభుత్వం శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జీఆర్ఎంబీ సమావేశం వాయిదా పడటం బీఆర్‌ఎస్ సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment