---Advertisement---

ఓవర్‌లోడ్‌తో పడవ బోల్తా.. జింబాబ్వేలో 15 మంది మృతి, 27 మంది గల్లంతు..!

August 12, 2026

Summarize with AI

---Advertisement---

ప్రయాణికులతో వెళ్తున్న పడవ(Boat) ఒక్కసారిగా బోల్తా పడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికా దేశమైన జింబాబ్వేలో(Zimbabwe) చోటుచేసుకుంది. ప్రముఖ కరీబా సరస్సులో (Lake Kariba) ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురై నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో పడవలో మొత్తం 114 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 27 మంది గల్లంతైనట్లు (Missing) అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం స్థానిక పోలీసులు, సహాయక బృందాలు కరీబా సరస్సులో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా టికెట్లు తీసుకుని పలువురు చిన్నారులు కూడా పడవలో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి అసలు కారణాలపై స్థానిక యంత్రాంగం దర్యాప్తు కొనసాగిస్తోంది.

సరస్సులో సహాయక చర్యలు (Rescue Operations) ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గల్లంతైన 27 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. వారి పరిస్థితి తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment