హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల (Illegal Constructions)కూల్చివేతలతో (Demolitions) వార్తల్లో నిలిచిన హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) రంగనాథ్‌కు (Ranganath) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్ ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన ముందస్తు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారన్న ఆరోపణలపై ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వాణి సహకార గృహ నిర్మాణ సంఘానికి సంబంధించిన భవనాల కూల్చివేత వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
కోర్టు ఆదేశాలు (Court Orders) అమల్లో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా యంత్రాలతో కూల్చివేతలు చేపట్టడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు ధిక్కరణ చర్యలకు శ్రీకారం చుట్టింది.
రెవెన్యూ అధికారుల (Revenue Officials) నుంచి ఎలాంటి అధికారిక సూచనలు లేదా నివేదికలు లేకుండానే హైడ్రా అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని బాధితుల తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ రంగనాథ్ తీసుకున్న చర్యల కారణంగా ఇతర ప్రభుత్వ అధికారులు కూడా కోర్టు ముందు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంలో పూర్తి నిజానిజాలను తేల్చేందుకు సంబంధిత స్థలంపై సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.







కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..!