---Advertisement---

Telangana Cabinet :ఇందిరమ్మ ఇళ్ల స్థలాలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..!

August 14, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (State Cabinet Meeting) గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకుంది.

హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటిజన్స్ అర్బన్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఎకానమీ ప్రాజెక్ట్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) కోసం భూకేటాయింపులకు (Land Allocation) కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేలా స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 (Telangana Rising Global Summit 2.0) నిర్వహణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతేడాది కంటే మరింత ఘనంగా ఈ సమ్మిట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈసారి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’(Invest Telangana) అనే ప్రధాన థీమ్‌తో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తెలంగాణలో ఇప్పటివరకు స్టార్టప్‌లు సాధించిన విజయాలు, పురోగతిని ప్రపంచానికి పరిచయం చేసేలా సమ్మిట్ ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి, స్టార్టప్ రంగంలో సాధించిన పురోగతిని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించేలా సమ్మిట్‌ను నిర్వహించనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment