కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ నేత, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చాట్రగడ్డ రవిపై ఓ మహిళా ఏఎన్‌ఎం లైంగిక, శారీరక, మానసిక వేధింపుల ఆరోపణలు చేశారు. నందివాడ మండలంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న మేడేపల్లి వకుళను కొంతకాలంగా రవి వేధిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వేధింపులను ఆపాలని వకుళ తండ్రి రాజేష్ రవిని మందలించినట్లు పేర్కొన్నారు.
అనంతరం తనను మందలించారనే ఆగ్రహంతో వకుళను బంటుమిల్లికి బదిలీ చేయించారని బాధితురాలు ఆరోపించారు. టీడీపీ నేత రవి వేధింపులపై వకుళ జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆగస్టు 17న నమోదైన ఫిర్యాదు నంబర్ KRI202608179694గా పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు అధికారులను కోరుతున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.







