---Advertisement---

డీఎస్సీపై చర్చకు ఎందుకీ భయం?.. మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన

August 20, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలిలో (Legislative Council) వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల (YSRCP MLCs) ఆందోళన ఉధృతమైంది. డీఎస్సీ నియామకాల్లో (DSC Recruitments) జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర చర్చ జరపడంతో పాటు సీబీఐ విచారణకు (CBI Investigation) ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. మండలి వాయిదా పడిన అనంతరం కూడా ఎమ్మెల్సీలు తమ నిరసనను కొనసాగించారు. పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ, అనంతరం మండలిలోనే నేలపై కూర్చుని ఆందోళన చేపట్టారు.

డీఎస్సీ అంశంపై చర్చ జరపాలని పదేపదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి(Ramachandra Reddy) విమర్శించారు. తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా(Sports Quota), టెట్ (TET) మినహాయింపులు, ఉపాధ్యాయుల సస్పెన్షన్ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులపై వెంటనే చర్యలను ఉపసంహరించుకోవాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

ఎమ్మెల్సీ మధుసూధన్(Madhusudhan) మాట్లాడుతూ, స్పోర్ట్స్ కోటా (Sports Quota) శాతాన్ని పెంచడం, డీఎస్సీకి ముందు, తర్వాత వేర్వేరు జీవోలు తీసుకురావడం వంటి అంశాలపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. జీవోలను అడ్డుపెట్టుకుని అక్రమాలు జరిగాయని, ఉద్యోగాల కోసం భారీ మొత్తాల్లో బేరసారాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఇసాక్ బాషా (Isaac Basha) కూడా డీఎస్సీ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణకు సిద్ధంగా లేకపోవడమే అనుమానాలకు బలం చేకూరుస్తోందని విమర్శించారు.

అంతకుముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి ర్యాలీగా శాసన మండలికి బయలుదేరారు. “మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ”(“Not Mega DSC.. It is Fraud DSC”) అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఆరోపణలపై బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment