---Advertisement---

కేసీఆర్‌పై నటుడు రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్!

August 24, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారారు. రాజకీయ(Political), సామాజిక (Social) అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించే ఆయన.. తాజాగా చేసిన ఓ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

సోమవారం ఉదయం ఎక్స్ వేదికగా రాహుల్ రామకృష్ణ ‘చితి చివరిదాంక… కేసీఆర్!’ అంటూ పోస్ట్ (Post) చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలను ఏ సందర్భంలో చేశారనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు. దీంతో రాహుల్ రామకృష్ణ పోస్టుపై నెటిజన్లు (Netizens) తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

కేసీఆర్ అభిమానులు (KCR Fans) కొందరు ఈ పోస్టుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేస్తుండగా.. మరికొందరు రాహుల్ రామకృష్ణకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఈ ఒక్క పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో(Social Media) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాహుల్ రామకృష్ణ గతంలోనూ రాజకీయ అంశాలపై చేసిన పోస్టులతో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై జనసేన అభిమానులు (Janasena Fans) తీవ్రంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి.

నటుడిగా రాహుల్ రామకృష్ణకు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. సహజమైన నటన, విభిన్నమైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన అర్జున్ రెడ్డి, గీత గోవిందం, బ్రోచేవారెవరురా, జాతిరత్నాలు, ఆర్ఆర్ఆర్, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

నటుడిగా మాత్రమే కాకుండా రచయితగానూ రాహుల్ రామకృష్ణ తన ప్రతిభను చాటుకున్నారు. అయితే తాజాగా కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన ఈ పోస్టు వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది మాత్రం ఆయన వివరణ ఇస్తేనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment