---Advertisement---

మాదాపూర్ కారు ప్రమాదం వెనుక రాజకీయ మౌనం.. కూటమిలో ‘సైలెంట్ వార్’ నడుస్తోందా?

August 22, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్‌లోని(Hyderabad) మాదాపూర్‌లో(Madhapur) జరిగిన ఆస్టన్ మార్టిన్(Aston Martin) కారు ప్రమాదం(Car Accident) ఇప్పుడు కేవలం రోడ్డు ప్రమాద ఘటనగా మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అధికార కూటమిలోని అంతర్గత రాజకీయాలపై కూడా చర్చకు దారితీస్తోంది. ఈ ఘటనలో ఒడిశాకు(Odisha) చెందిన 26 ఏళ్ల భారతి ముఖి(Bharati Mukhi) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదానికి కారణమైన కారును జనసేన(Jana Sena) రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్(Lingamaneni Ramesh) కుమారుడు లింగమనేని సంజుష్ (Lingamaneni Sanjush)నడిపినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన జాతీయ స్థాయి మీడియా దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యంగా రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి(Arnab Goswami) నిర్వహించిన చర్చ ఈ కేసును మరింత రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మార్చింది. చర్చ సందర్భంగా టీడీపీ తరఫున ప్రతినిధులను పంపలేదని అర్నాబ్ గోస్వామి పేర్కొనడం. అలాగే పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan)వ్యక్తిగతంగా వాట్సాప్ సందేశం పంపినా స్పందన రాలేదని అర్నాబ్ గోస్వామి చెప్పిన అంశం కూడా సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో ప్రమాద ఘటనకు రాజకీయ రంగు పులుముతూ పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. జనసేనను రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టేందుకే ఈ వ్యవహారాన్ని టీడీపీలోని ఒక వర్గం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున కావాలనే చర్చకు తీసుకువచ్చారనే ప్రచారం సాగుతుంది.

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకం(Local Body Elections Seat Sharing), జనసేన స్వతంత్ర రాజకీయ వైఖరి వంటి అంశాలపై కూటమి పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే రాజకీయ చర్చ కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రమాదం విషయంలో టీడీపీ(TDP) మౌనంగా ఉండటం లాంటి ఘటనలు చోటుచేసుకోవడం మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది.

మరోవైపు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించకపోవడం కూడా ప్రశ్నలకు దారితీస్తోంది. టీడీపీ తనకి చెక్ పెడుతుందని ఊహాగాలు ఉన్నా, కూటమిలో వివాదాలు మరింత పెరగకుండా ఉండేందుకే ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

మొత్తంగా మాదాపూర్ ఆస్టన్ మార్టిన్ కారు ప్రమాదం ఒక విషాదకర రోడ్డు ప్రమాద ఘటనగా ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. టీడీపీ–జనసేన(TDP-Jana Sena) మధ్య నిజంగానే అంతర్గత విభేదాలు ఉన్నాయా? లేక ఇదంతా రాజకీయ ఊహాగానాలకే పరిమితమా? అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు స్పష్టత ఇవ్వనున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment