సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో కలకలం రేపిన దంపతుల హత్య కేసులో (Couple Murder Case) ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో(Love Affair) కన్నతల్లిదండ్రులను(Parents) మత్తు ఇంజెక్షన్ (Sedative Injection) ఇచ్చి హత్య చేసిన యువతి సురేఖ(Surekha), బెయిల్‌పై(Bail) జైలు(Jail) నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకుంది.
సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా (Nurse) పనిచేసిన సురేఖ ఓ యువకుడిని ప్రేమించింది. అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిపై ఆగ్రహం పెంచుకుంది. ఈ నేపథ్యంలో 2026 జనవరిలో వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలోని తన ఇంట్లో తల్లిదండ్రులకు మత్తుమందు కలిపిన ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించేందుకు సురేఖ ప్రయత్నించినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇటీవల ఈ కేసులో బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలైన సురేఖ సంగారెడ్డికి తిరిగి వచ్చింది. శాంతినగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న ఆమె శనివారం రాత్రి తల్లిదండ్రుల హత్యకు ఉపయోగించిన మత్తు ఇంజెక్షన్‌తోనే తనకు తాను ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఘటనాస్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మరణానికి ఎవరూ కారణం కాదని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సురేఖ మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital) మార్చురీలో భద్రపరిచారు.
మరోవైపు, సురేఖ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నట్లు సమాచారం. కన్నతల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె మృతిపై కుటుంబ సభ్యులు(Family Members) స్పందించకపోవడంతో వారిని ఒప్పించి సంగారెడ్డికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.







