టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) ప్రస్తుతం సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’(Bhogi) సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), డింపుల్ హయాతి (Dimple Hayathi) హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. శర్వానంద్ ఇప్పటివరకు చేయని ఓ పవర్‌ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇక రక్షాబంధన్(Raksha Bandhan) సందర్భంగా ‘భోగి’ మూవీ టీమ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌లో శర్వానంద్ (Sharwanand) లుంగీ, బనియన్ ధరించి, మెడలో టవల్ వేసుకుని, చేతిలో కత్తి (Knife) పట్టుకుని కనిపించాడు. అంతేకాదు.. తాటి ముంజ కాయలను కోస్తూ ఉండగా, ఆయన పక్కనే 5 మంది అమ్మాయిలు కూర్చొని వాటిని తింటూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రక్షాబంధన్ సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేయడంతో సినిమాలో శర్వానంద్‌కు 5 మంది అక్కాచెల్లెళ్లు ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. తన అక్కాచెల్లెళ్ల (Five Sisters) విషయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే.. సాధారణంగా సైలెంట్‌గా ఉండే శర్వానంద్ ఒక్కసారిగా మాస్ అవతారంలో తిరగబడతాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
అయితే పోస్టర్‌లో చూపించిన అంశాల ఆధారంగా సినిమా కథపై మేకర్స్ చిన్న హింట్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ పాత్ర, అతని అక్కాచెల్లెళ్ల (Five Sisters) మధ్య ఉన్న అనుబంధం, కథలో వచ్చే కీలక మలుపులు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
మరి ఈ పోస్టర్‌కు, సినిమా కథకు మధ్య ఉన్న అసలు లింక్ ఏంటి? శర్వానంద్ నిజంగానే 5 మంది అక్కాచెల్లెళ్లకు అన్నగా కనిపించబోతున్నాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనా కొత్త పోస్టర్‌తో ‘భోగి’పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.







