---Advertisement---

హామీల వీడియో చూపించి.. కూటమి ప్రభుత్వానికి ఏపీ జేఏసీ సవాల్!

August 28, 2026

Summarize with AI

---Advertisement---

కూటమి ప్రభుత్వంపై (Coalition Government) తమ పోరాటం (Fight) ఆగదని, ఉద్యోగుల (Employees) సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి (AP JAC Amaravati) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎన్నికల సమయంలో, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఏపీ జేఏసీ అమరావతి నిర్వహించిన ఉద్యమ సదస్సులో ఆయా హామీలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.

ప్రభుత్వం బెదిరింపులకు ఏపీ జేఏసీ భయపడదని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు(Arrears), మెరుగైన పీఆర్సీ(PRC), ఇంటీరిమ్ రిలీఫ్(Interim Relief), డీఏలు(DA), ఇతర పెండింగ్ ప్రయోజనాల కోసం మాత్రమే తాము పోరాడుతున్నామని అన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇంటీరిమ్ రిలీఫ్ కూడా ప్రకటించకపోవడం చరిత్రలోనే తొలిసారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని, ఇంటీరిమ్ రిలీఫ్ ప్రకటిస్తామని, పెండింగ్ బకాయిలను త్వరగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని బొప్పరాజు గుర్తుచేశారు. పోలీసులతో సమానంగా శని, ఆదివారాల్లో సెలవులు కల్పించడం, హోంగార్డుల వేతనాల పెంపు (Home Guards Salaries Increase), ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (Employees Health Scheme) సమస్యల పరిష్కారం, తక్కువ ధరకే ఇంటి స్థలాల కల్పన, సరెండర్ లీవ్, ఎర్న్డ్ లీవ్, ప్రావిడెంట్ ఫండ్ వంటి బకాయిలను పరిష్కరిస్తామని కూడా హామీలు ఇచ్చారని పేర్కొన్నారు.

అయితే ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా ఈ హామీలు ఎంతవరకు అమలయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదని, అదనంగా ఒక్క రూపాయి జీతం కోరడం లేదని స్పష్టం చేశారు. ఉచితంగా ఏదైనా ఇవ్వాలని అడగడం లేదని, బోనస్‌లు కోరడం లేదని అన్నారు. ప్రభుత్వం, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు.

సీపీఎస్ విధానాన్ని (CPS System) పునఃసమీక్షించి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకువస్తామని, మెరుగైన పీఆర్సీతో పాటు అలవెన్సులు, పెండింగ్ చెల్లింపులు చేస్తామని, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఐఆర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీలను కూడా ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రస్తావించారు. తక్కువ వేతనాలు పొందుతున్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని కూడా గుర్తుచేశారు.

ఉద్యోగులు గత రెండేళ్లుగా తమకు రావాల్సిన హక్కులు, బకాయిల కోసం మాత్రమే పోరాడుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, బెదిరింపులు లేదా ఒత్తిళ్లతో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటం ఇకపై ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment