యంగ్ హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju) తాజాగా తీవ్ర అస్వస్థతకు (Severe Illness) గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో(Hospital) చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మమితా బైజు ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితి (Health Condition) ప్రస్తుతం కష్టంగా ఉందని, తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నానని వెల్లడించారు.
మమితా బైజు అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఆస్ట్రేలియా పర్యటన కూడా రద్దయింది. మెల్బోర్న్లో(Melbourne) జరగాల్సిన క్లైడ్ ఓనమ్ 2026(Clyde Onam 2026) వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ (Clyde Malayalee Association) వెల్లడించింది.
మమితా బైజు ఆరోగ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మమితా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సందేశాలు పంపుతున్నారు.
ఇక మమితా బైజు వరుస విజయాలతో కథానాయికగా దూసుకెళ్తున్నారు. ఆమె నటించిన 3 సినిమాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే విడుదలై రూ.100 కోట్ల క్లబ్లో చేరడం విశేషంగా మారింది. దీంతో మమితా బైజుకు వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి.
మరోవైపు మలయాళంలో ఘన విజయం సాధించిన ‘బెత్లెహోమ్ కుటుంబం యూనిట్’ (Bethlehem Kudumbam Unit)చిత్రం సెప్టెంబర్ 4న తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మమితా బైజు అలరించనున్నారు.







