తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) మరోసారి హైడ్రామా చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న వరుస ఘర్షణలు, నిరసనల నేపథ్యంలో సభలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభా హుందాతనానికి భంగం కలిగించేలా వ్యవహరించడంతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ(BRS MLAs) ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు (Current Assembly Session) ముగిసే వరకు సస్పెండ్ (Suspended) చేశారు.
సస్పెన్షన్‌కు గురైన వారిలో హరీశ్‌రావు(Harish Rao), జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మాధవరం, మాణిక్‌రావు, చింత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సంజయ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుధీర్‌రెడ్డి, అనిల్‌యాదవ్, గంగుల కమలాకర్‌తో పాటు బీఆర్ఎస్‌కు చెందిన ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని సభలో ప్రకటించారు.
సస్పెన్షన్ నిర్ణయం వెలువడే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అసెంబ్లీ బయట ఉన్నారు. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలియగానే ఆయన వెంటనే సభలోకి చేరుకున్నారు. అనంతరం సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ స్పీకర్ ఛాంబర్ (Speaker’s Chamber) వైపు వెళ్లారు. జరిగిన పరిణామాలపై స్పీకర్‌కు వివరణ ఇవ్వడంతో పాటు తమ నిరసనను వ్యక్తం చేసేందుకు వారు ప్రయత్నించారు.
అయితే స్పీకర్ ఛాంబర్ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ మార్షల్స్(Assembly Marshals) అడ్డుకున్నారు. స్పీకర్ ఛాంబర్ ముందు మార్షల్స్ వారిని నిలిపివేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మార్షల్స్ చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే ఆందోళనకు దిగారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో కొంతసేపు గందరగోళ వాతావరణం కనిపించింది.
ఈ పరిణామాలతో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించే చర్యలను సహించబోమని అధికార పక్షం స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.








