---Advertisement---

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు.

October 9, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇప్పటికే హైకోర్టులో నిలబడవని తెలిసినా జీవోలు జారీ చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆడిన రాజకీయ డ్రామా ఏమిటో తేలిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ వర్గాల ఓట్లను ఆకర్షించేందుకే కూటమి ప్రభుత్వం ఈ నాటకానికి తెరతీసిందని వైఎస్సార్‌సీపీ నాయకత్వం తీవ్రంగా ఆరోపిస్తోంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా, కేవలం జీవోల ద్వారా కల్పించే రిజర్వేషన్లు న్యాయస్థానాల్లో నిలబడవని తెలిసినా కూటమి ప్రభుత్వం కాలయాపన చేసిందని ధ్వజమెత్తింది. న్యాయపరంగా నిలిచే శాశ్వత పరిష్కారం చూపకుండా చెల్లుబాటు కాని జీవోలు జారీ చేసి బీసీ సమాజాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించిందని విమర్శలు గుప్పిస్తోంది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో అధికారిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా రాజకీయ ప్రాతినిధ్యంలో బీసీలకు పెద్దపీట వేశారు. జెడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, కేబినెట్ పదవులు, ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే పంథాలో వెళ్తూ, చివరికి “కోర్టులు అడ్డుకున్నా బీసీలకు పెద్దపీట వేశాం” అని చెప్పుకునేలా రాజకీయంగా క్రెడిట్ పొందేందుకు ప్రణాళిక రచించిందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎందుకు కల్పించడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం లేదా రాజ్యాంగ సవరణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపడం ఎందుకు సాధ్యం కావడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment