---Advertisement---

తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన.. గవర్నర్‌కు కేటీఆర్ బృందం ఫిర్యాదు!

September 9, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎమర్జెన్సీని (Emergency) తలపించేలా పాలన (Governance) సాగిస్తోందని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం(Democracy) తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని విమర్శించారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జరిగిన పరిణామాలను గవర్నర్(Governor) శివప్రతాప్ శుక్లా(Shiv Pratap Shukla) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

సెప్టెంబర్ 9 బుధవారం కేటీఆర్ నేతృత్వంలో సస్పెన్షన్‌కు (Suspended) గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 10 మంది బృందం లోక్ భవన్‌లో(Lok Bhavan) గవర్నర్‌ను కలిసింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై 13 పేజీల ఫిర్యాదు లేఖను అందజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో యూరియా కొరత(Urea Shortage), రైతు భీమా(Rythu Bima), ఉద్యోగాల భర్తీ(Job Recruitment), పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు (Polytechnic Students’ Issues) వంటి అనేక అంశాల్లో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. నల్ల టీ షర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్లిన తమను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని (Sabitha Indra Reddy) పురుష పోలీసులు గొంతు పట్టుకున్నారని, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy చీర పట్టుకుని లాగారని కేటీఆర్ ఆరోపించారు. తమపై దాడి చేసి, తిరిగి తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్(KCR) మరణాన్ని కోరుకున్నారంటూ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై దాడికి కాంగ్రెస్ కార్యకర్తలను ప్రేరేపించారని విమర్శించారు. స్పీకర్ (Speaker) వ్యవహారంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ శాసనసభను దుష్యాసన సభగా మార్చేశారని అన్నారు.

అసెంబ్లీ బయట జరిగిన ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని పిలిపించి మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మంచివి కావని గవర్నర్ తమతో చెప్పినట్లు వెల్లడించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment