---Advertisement---

రామాయణ తొలి పాట విడుదల.. రాముడు-సీత పరిణయ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న జై జై రామ్!

September 14, 2026

Summarize with AI

---Advertisement---

రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ(Ramayana). నితీష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన తొలి పాట (First Song) మరింత ఆకట్టుకుంటోంది.

వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా రామాయణ నుంచి జై జై రామ్ (Jai Jai Ram) అంటూ సాగే మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించేలా సాగుతున్న ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పాటలో రాముడు(Lord Rama), సీత (Sita) పాత్రలకు సంబంధించిన అందమైన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సీత స్వయంవరంలో(Sita Swayamvaram) రాముడు (Lord Rama) పాల్గొనే ఘట్టంతో పాటు రాముడు, సీత పరిణయం (Sita Marriage) వరకు జరిగిన కీలక పరిణామాలను ఈ పాటలో చూపించారు. ఈ సన్నివేశాలు రామాయణ కథలోని ప్రేమ, భక్తి, భావోద్వేగాలను ప్రతిబింబించేలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ పాటకు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) సంగీతం అందించగా, శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్ తమ గాత్రంతో అలరించారు. పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

రామాయణ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. యష్ రావణుడిగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ తారాగణం, అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన జై జై రామ్ పాట ఆ అంచనాలను మరింత పెంచుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment