---Advertisement---

రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ ఖరారు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

September 14, 2026

Summarize with AI

---Advertisement---

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja, దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’(Irumudi) చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న అనంతరం ఇప్పుడు ఓటీటీ విడుదలకు (OTT Release) సిద్ధమైంది. ఇప్పటివరకు మాస్, యాక్షన్ తరహా పాత్రల్లో ఎక్కువగా కనిపించిన రవితేజ.. ఈ సినిమాలో మాత్రం విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

‘ఇరుముడి’ చిత్రంలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) నటించారు. రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర (Baby Nakshatra) కనిపించింది. ఆమె తన చక్కటి నటనతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

రవితేజ మాస్ ఇమేజ్‌కు తగ్గ యాక్షన్ అంశాలతో పాటు శివ నిర్వాణ శైలిలోని కుటుంబ భావోద్వేగాలను మేళవించి సినిమాను తెరకెక్కించారు. దీంతో ‘ఇరుముడి’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సాధారణ ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు.

థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేయనుంది. ‘ఇరుముడి’ డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. మేకర్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ‘ఇరుముడి’ సెప్టెంబర్ 18 (September 18) నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఇకపై నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఇంటి నుంచే వీక్షించవచ్చు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment