---Advertisement---

డేవిడ్‌ రెడ్డిలో రమ్యకృష్ణ.. శివగామిని మించిన ఉగ్రరూపంలో ‘కమలా రెడ్డి’!

September 15, 2026

Summarize with AI

---Advertisement---

మంచు మనోజ్‌ (Manchu Manoj) కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘డేవిడ్‌ రెడ్డి’ (David Reddy) చిత్రంలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ (Ramya Krishnan) కీలక పాత్రలో నటిస్తున్నారు. హనుమా రెడ్డి (Hanuma Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ మోతుకూరి(Bharath Motukuri), వెంకటరెడ్డి నల్లగంగుల (Venkata Reddy Nallagangula) నిర్మిస్తున్నారు. 1897 నుంచి 1920ల మధ్య బ్రిటిష్‌ పాలన కాలం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది.

ఈ చిత్రంలో మరియా రియాబోషాప్కా (Maria Ryaboshapka) కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని(Samuthirakani), రమ్యకృష్ణ(Ramya Krishnan), అభయ్ డియోల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమె పాత్రకు సంబంధించిన తొలి పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె ‘కమలా రెడ్డి’గా (Kamala Reddy) కనిపించనున్నారు.

పోస్టర్‌లో రమ్యకృష్ణ లుక్‌ ఎంతో గంభీరంగా, శక్తివంతంగా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్‌ చూస్తే ‘బాహుబలి’లో ఆమె పోషించిన శివగామి పాత్ర గుర్తుకు వస్తుండగా.. ‘డేవిడ్‌ రెడ్డి’లో కమలా రెడ్డి పాత్ర మరింత ఉగ్రంగా ఉండబోతుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

మరోవైపు మంచు మనోజ్‌ (Manchu Manoj) రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కలిసి నటించడం తనకు గౌరవంగా భావిస్తున్నానని పేర్కొంటూ.. ఉగ్రరూపంలో ఉన్న కమలా రెడ్డిని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. సినిమాలో ఆమె యాక్షన్‌ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయని వెల్లడించారు.

దీంతో కమలా రెడ్డి పాత్ర ఎలా ఉండబోతోంది? రమ్యకృష్ణ యాక్షన్‌ సన్నివేశాల్లో ఏ స్థాయిలో మెప్పించబోతున్నారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మంచు మనోజ్‌ కెరీర్‌లో విభిన్నమైన చిత్రంగా తెరకెక్కుతున్న ‘డేవిడ్‌ రెడ్డి’కి రమ్యకృష్ణ పాత్ర మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment