---Advertisement---

నానక్‌రామ్‌గూడలో స్థల వివాదం.. అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు!

September 15, 2026

Summarize with AI

---Advertisement---

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి(Kancharla Chandrashekar Reddy) ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని(Hyderabad) నానక్‌రామ్‌గూడలో(Nanakramguda)చోటుచేసుకున్న స్థల వివాదంలో ఆయనపై దౌర్జన్యం(Assault), ఆక్రమణ యత్నానికి(Encroachment Attempt) సంబంధించి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. భద్రతా సిబ్బందిని బెదిరించి గేటు తాళాలు పగులగొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.

నానక్‌రామ్‌గూడ సర్వే నంబర్ 130లోని మంత్రీ కాస్మోస్ ఐటీ భవనం (Mantri Cosmos IT Building) వద్ద ఉదయం సుమారు 8.40 గంటలకు మురళీధర్ రెడ్డి(Muralidhar Reddy), గడ్డం రవి (Gaddam Ravi) నేతృత్వంలో కొందరు వ్యక్తులు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గేటు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించడంతో పాటు కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేసి, స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు టిన్‌షీట్లతో కంచెలు ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు.

అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిని (Security Staff) నెట్టివేసి దాడికి పాల్పడ్డారని, తమ పనులకు అడ్డుగా వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ మంత్రీ కాస్మోస్ యజమానుల సంఘం (Mantri Cosmos Owners Association) ప్రతినిధి పెద్దిరాజు (Peddiraju) పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ ప్రాంతం ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉండటంతో పాటు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు(Electrical Transformers), జనరేటర్లు(Generators), వ్యర్థాల నిర్వహణ షెడ్లు(Waste Management Sheds) ఉన్నాయని యజమానుల సంఘం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక వాహనాలు, నీటి ట్యాంకర్లు వెళ్లేందుకు నైరుతి మార్గం కీలకమని, దాన్ని మూసివేయడం వల్ల ఐటీ సంస్థల కార్యకలాపాలతో పాటు అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది.

ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయని, గేటు తాళాలు పగులగొట్టడం, భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను పెన్‌డ్రైవ్‌లో పోలీసులకు అందజేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గచ్చిబౌలి పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు ప్రతులు అందజేశారు.

అల్లు అర్జున్‌కు బంధువు కావడంతో పాటు రాజకీయ నేపథ్యం ఉన్న చంద్రశేఖర్ రెడ్డిపై వచ్చిన ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment