---Advertisement---

‘దాయరా’ కథ దిశ కేసు ఆధారంగా తెరకెక్కిందా? మేఘ్నా గుల్జార్ క్లారిటీ!

September 16, 2026

Summarize with AI

---Advertisement---

కరీనా కపూర్ ఖాన్(Kareena Kapoor Khan), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన ‘దాయరా'(Diyara) సినిమా విడుదలకు ముందే ఆసక్తిని పెంచుతోంది. మేఘ్నా గుల్జార్ (Meghna Gulzar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై వినీత్ జైన్(Vineet Jain), ధవల్ గడా (Dhawal Gada) ఈ చిత్రాన్ని నిర్మించారు.

దాయరాలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) డీసీపీ రామన్ కుమార్‌గా, కరీనా కపూర్ (Kareena Kapoor) డీసీపీ అజూని కోహ్లీగా (DCP Azuni Kohli) పోలీస్ అధికారుల పాత్రల్లో కనిపించనున్నారు. నిజ జీవిత ఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.

ఇటీవల విడుదలైన దాయరా ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు 2019లో హైదరాబాద్‌లో(Hyderabad) జరిగిన వెటర్నరీ వైద్యురాలి అఘాయిత్యం, హత్య ఘటనతో పాటు ఆ తర్వాత జరిగిన పోలీస్ కాల్పులను గుర్తు చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా నేరుగా దిశ కేసు ఆధారంగా తెరకెక్కిందా అనే చర్చ మొదలైంది.

అయితే దీనిపై దర్శకురాలు మేఘ్నా గుల్జార్ స్పష్టత ఇచ్చారు. దాయరా సినిమా 2019 హైదరాబాద్ ఘటనను నేరుగా ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం కాదని తెలిపారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పలు నిజ జీవిత ఘటనల్లోని విభిన్న అంశాలను తీసుకుని కథను రూపొందించినట్లు చెప్పారు. అందువల్ల దీనిని ఒక నగరం, రాష్ట్రం లేదా ప్రత్యేక పోలీస్ విభాగానికి సంబంధించిన కథగా చూడకూడదని వివరించారు.

2019లో హైదరాబాద్ శివార్లలో జరిగిన వెటర్నరీ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 26 ఏళ్ల వైద్యురాలిపై అఘాయిత్యం చేసి హత్య చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 6న నిందితులను చటాన్‌పల్లికి తీసుకెళ్లిన సమయంలో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు పోలీసులు అప్పట్లో తెలిపారు.

ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు దిశ ఘటనను (Disha Incident) గుర్తు చేస్తున్నప్పటికీ, దాయరా ఒకే కేసు ఆధారంగా తెరకెక్కలేదని దర్శకురాలు స్పష్టం చేశారు. సినిమాలో నిజ జీవిత ఘటనల ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది సెప్టెంబర్ 18న సినిమా విడుదలైన తర్వాత మరింత స్పష్టత రానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment