తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన సంగీత సామ్రాజ్ఞి(Music Legend), భారతరత్న(Bharat Ratna) ఎంఎస్ సుబ్బులక్ష్మి(Music Legend) జీవిత కథ వెండితెరపైకి రాబోతోంది. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri)దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో నటించనుండగా, అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు.
ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని(Chennai) మ్యూజిక్ అకాడమీ (Music Academy) వేదికగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఎంఎస్ సుబ్బులక్ష్మి తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఏకం చేశారని కొనియాడారు. సంస్కృతం, హిందీతో పాటు అనేక భాషల్లో ఆమె పాటలు ఆలపించారని, ఏ భాషలో పాడినా ఆ భాషకు మరింత అందాన్ని తీసుకొచ్చేవారని అన్నారు.
ఎంఎస్ సుబ్బులక్ష్మి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని కమల్ హాసన్ తెలిపారు. ఆమె ఆలపించిన సుప్రభాతం, లలితా సహస్రనామం, రంగపుర విహార వంటి పాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పారు. మహాత్మా గాంధీ (Mahatma Gandhi) కూడా ఆమెకు అభిమానిగా ఉండేవారని గుర్తుచేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నిర్మాతలకు, దర్శకుడికి శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు రష్మిక మందన్న మాట్లాడుతూ ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో నటించే అవకాశం రావడం తనకు ఎంతో గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆమె 110వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత ప్రయాణంలో ఒక చిన్న భాగం కావడం తనకు ఎంతో గర్వంగా, గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రష్మిక వెల్లడించారు.






