---Advertisement---

‘రూ.1000 కోట్లు ఇచ్చి మా ఆస్తులన్నీ తీసుకోండి’… రేవంత్‌కు కేటీఆర్ సవాల్!

September 18, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్ (Hyderabad) బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేస్‌ను (Formula E Race) నిర్వహించామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. రేస్ నిర్వహణలో అవినీతి (Corruption) జరిగిందంటూ తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు (Nampally ACB Court) హాజరైన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు.

కేసులకు తాము భయపడబోమని కేటీఆర్ అన్నారు. న్యాయవ్యవస్థపై (Judiciary) తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

ఇతర రాష్ట్రాలు తమ ప్రాంతాల బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో(International Level) కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, తెలంగాణలో(Telangana) మాత్రం తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తమిళనాడు సీఎం విజయ్ (Tamil Nadu CM Vijay) ఫార్ములా ఈ రేస్ కోసం లండన్ వెళ్లారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తమను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తమ వద్ద లక్ష కోట్లు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఒక ఆఫర్ ఇస్తున్నానని కేటీఆర్ అన్నారు.

తమ పేర్లపై లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, ఆ ఆస్తులను తీసుకుని తమకు రూ.1000 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ అన్నారు. మిగిలిన రూ.99 వేల కోట్లను రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఖర్చు చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో లక్ష కోట్ల రూపాయల వ్యయం అంటూ ప్రచారం చేసినట్లుగానే, ఇప్పుడు తమపై కూడా విషప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment