---Advertisement---

22ఏ భూములపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు త్వరలో ఊరట!

September 18, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో (Telangana) 22ఏ జాబితాలో (22A List) ఉన్న భూముల సమస్యలకు (Lands Issues) పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు (Land Owners) ఉపశమనం కల్పించేందుకు హైలెవల్ కమిటీని (High-Level Committee) ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో మొత్తం 3 మంది అధికారులు ఉండనున్నారు. సీసీఎల్‌ఏ కమిషనర్‌ (CCLA Commissioner) కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, లా సెక్రటరీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ సభ్యులుగా కొనసాగనున్నారు.

118 జీవో కారణంగా భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది. 22ఏ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసి, అర్హత ఉన్న కేసులకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోనుంది.

ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అసెంబ్లీలో(Assembly) కీలక ప్రకటన చేశారు. 22ఏ భూ సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే సభలో ఈ అంశంపై ప్రకటన చేసినట్లు తెలిపారు.

భూ సమస్యలను పరిష్కరించేందుకు కమిటీకి 1 నెల గడువు విధించినట్లు మంత్రి పేర్కొన్నారు. 118 జీవోకు సంబంధించిన సమస్యలపై కూడా మెమో జారీ చేశామని, వాటిని పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

22ఏ జాబితాలో భూములు ఉండటంతో రిజిస్ట్రేషన్లు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న వారి నుంచి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. పరిశీలన అనంతరం అర్హత ఉన్న భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment