---Advertisement---

విశ్వంభర రిలీజ్ డేట్ లాక్?.. మెగాస్టార్ మూవీపై క్రేజీ టాక్!

October 6, 2026

Summarize with AI

---Advertisement---

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), త్రిష (Trisha) జంటగా నటిస్తున్న భారీ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’(Vishwambhara). ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినా, గ్రాఫిక్స్‌, విజువల్ ఎఫెక్ట్స్‌ పనుల కారణంగా విడుదల ఆలస్యమవుతోంది. దీంతో సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆసక్తి నెలకొంది.

తాజాగా ‘విశ్వంభర’ రిలీజ్‌పై టాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో మహాశివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఫ్యాంటసీతో పాటు దైవిక అంశాలు ఉన్న కథ కావడంతో మహాశివరాత్రి సీజన్ కలిసొస్తుందని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో నవంబర్‌లో, ఆ తర్వాత సంక్రాంతికి విడుదల చేస్తారని ప్రచారం జరిగినా.. ఇప్పుడు మహాశివరాత్రి బరిలోకి తీసుకురానున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘కాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఆ సినిమా విడుదల తర్వాత ‘విశ్వంభర’ను రిలీజ్ (Release) చేయాలని భావిస్తున్నట్లు టాక్.

అయితే మార్చి విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన (Official Announcement) రాలేదు. మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించే వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment