రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వ పాలనలో రైతుల (Farmers) సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిపై కేసులు నమోదు చేయడం, బేడీలు వేయడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా విమర్శించారు. రైతులపై పోలీసు కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి (Congress Government Failure) నిదర్శనమని మండిపడ్డారు.
రైతుల ఆందోళనలపై హరీశ్ రావు ఆగ్రహం
ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం దారుణమని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో పంటలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. నీళ్లు, విద్యుత్ సమస్యలపై రైతులు రోడ్డెక్కి ప్రశ్నిస్తే.. వారి సమస్యలను పరిష్కరించకుండా అక్రమ కేసులు పెట్టి పోలీసులతో భయపెట్టడం ఏంటని ప్రశ్నించారు.
కృష్ణా నదిలో(Krishna River) నీటి ప్రవాహాలు ఉన్న సమయంలో వాటిని లిఫ్ట్ (Lift) చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోకుండా తెలంగాణకు జల ద్రోహం చేశారని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేసిన తప్పులకు రైతులు శిక్ష అనుభవించాలా? అని నిలదీశారు.
ప్రజా పాలననా.. ప్రజా పీడననా?
సాగునీరు(Irrigation Water), విద్యుత్ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇది ప్రజా పాలననా? లేక ప్రజా పీడననా? అని ప్రశ్నించారు.
రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు. రైతు వ్యతిరేక చర్యలు కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.








