ఉత్తరాంధ్రలో బీసీల హక్కుల కోసం వైఎస్సార్సీపీ(YSR Congress Party) సమరానికి సిద్ధమైంది. ఈ నెల 16న విశాఖపట్నంలో ‘ఉత్తరాంధ్ర బీసీ గర్జన’(Uttarandhra BC Garjana) పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరుకానున్నారు.
రిజర్వేషన్ల (Reservations)పేరుతో చంద్రబాబు(Chandrababu Naidu) బీసీ వర్గాలను మోసం చేస్తున్న తీరును ప్రజల ముందుంచడంతో పాటు, బీసీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు, దాడులపై గళమెత్తాలని పార్టీ నేతలు నిర్ణయించారు. బీసీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం భవిష్యత్తు కార్యాచరణను ఈ వేదికగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.







