రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’(Ranabali. చరిత్రలో మరుగునపడిన ఓ విప్లవ యోధుడి కథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ (Trailer) ఆ అంచనాలను మరింత పెంచేలా ఉంది.
బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలు, కరవుతో అల్లాడిన ప్రజల పరిస్థితులు, తెల్లదొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని ‘రణబాలి’లో చూపించారు. అనంతపురం ప్రాంతానికి చెందిన సింగనమల బొబ్బిలి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఆయన తిరుగుబాటు, పోరాట సన్నివేశాలు ట్రైలర్లో హైలైట్‌గా నిలిచాయి.
కొత్త గెటప్‌లో కనిపించిన విజయ్.. రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్, యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. ‘జయమ్మ’గా(Jayamma) రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా బలమైన పాత్రలో కనిపిస్తున్నారు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారీ యాక్షన్ సన్నివేశాలకు అజయ్–అతుల్ (Ajay–Atul) అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచింది. గ్రాండ్ విజువల్స్ కూడా ట్రైలర్లో ఆకట్టుకున్నాయి.
అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ‘రణబాలి’పై ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ సరికొత్త అవతారం, రష్మిక పాత్ర, రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) టేకింగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.








