ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో, పురపాలక ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
నోటిఫికేషన్ లేదా విడుదలైన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని. నోటిఫికేషన్ నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు, 15 రోజుల్లో పురపాలక ఎన్నికలు, 16 రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, మిగిలిన ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరగనున్నాయి. ఎన్నికల కోసం 1,05,432 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసినట్లు ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు.






