---Advertisement---

ఆర్‌ఆర్‌-2 టెండర్లపై కేటీఆర్ సంచలన ఆరోపణలు.. రేవంత్‌కు బహిరంగ లేఖ..!

October 10, 2026

Summarize with AI

---Advertisement---

రూ.3,296 కోట్ల విలువైన టెండర్లలో (Tenders) అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. తక్కువ ధరలకు బిడ్లు వేసిన అర్హులైన సంస్థలను పక్కనపెట్టి, అధిక ధరలు కోట్ చేసిన కంపెనీలకు కాంట్రాక్టులు కేటాయించారని విమర్శించారు.

బుద్వేల్‌ (Budvel) నుంచి కొడంగల్‌ (Kodangal) వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే (Greenfield Expressway) పనులను ప్యాకేజీలుగా విభజించి, ముందుగా ఎంపిక చేసుకున్న సంస్థలకు కేటాయించారని కేటీఆర్ ఆరోపించారు. సాంకేతిక కారణాలతో కొందరు బిడ్డర్లను అనర్హులుగా ప్రకటించారని పేర్కొంటూ, టెండర్లను రద్దు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

టెండర్లకు సంబంధించిన సాంకేతిక మూల్యాంకన నివేదికలు, ప్యాకేజీల అంచనా వ్యయాలు, తుది కాంట్రాక్టు విలువలు, బిడ్ల వివరాలు, మూల్యాంకన కమిటీ సమావేశాల రికార్డులను బహిర్గతం చేయాలని కోరారు.

టెండర్ల వల్ల సుమారు రూ.600 కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర పరిశీలన జరపాలని కేటీఆర్ సూచించారు. హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్‌ పరిధిలో రూ.100 కోట్లకు పైబడిన కాంట్రాక్టులపై కాగ్‌ (CAG) ద్వారా ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని కోరారు.

ఆర్‌ఆర్‌-2 (RR-2) టెండర్లపై ప్రభుత్వం శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని, సాంకేతిక అర్హతలు, బిడ్డర్లకు వివరణ ఇచ్చే అవకాశం, ఆర్థిక బిడ్లు తెరిచే విధానంపై స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించి, ప్రజాధనాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment