---Advertisement---

బీసీ రిజర్వేషన్ల విషయంలో మేనిఫెస్టో హామీని పక్కన పెట్టిన కూటమి?

October 10, 2026

Summarize with AI

---Advertisement---

ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీని పక్కనపెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేయడం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టకుండా, స్థానిక సంస్థల్లో తక్కువ శాతం రిజర్వేషన్లు ప్రకటించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదని, దీంతో బీసీలకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. పంచాయతీ వార్డు సభ్యులకు 26.73 శాతం, సర్పంచ్‌లకు 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55 శాతం, ఎంపీపీలకు 24.60 శాతం, జడ్పీటీసీలకు 24.60 శాతం, జడ్పీ చైర్మన్‌లకు 23.08 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. అర్బన్ వార్డు సభ్యులకు 32.78 శాతం, మున్సిపల్ చైర్‌పర్సన్‌లకు 33.02 శాతం, మేయర్లకు 35.29 శాతం రిజర్వేషన్లు ఇస్తామని వెల్లడించారు.

గతంలోనూ టీడీపీ నాయకుడు బీరూ ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసు వేయించి బీసీలకు అన్యాయం చేశారంటూ చంద్రబాబుపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో, తాజాగా ప్రకటించిన రిజర్వేషన్ల శాతాలపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment