---Advertisement---

‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే కన్నుమూత.. 34 ఏళ్లకే విషాదం!

October 13, 2026

Summarize with AI

---Advertisement---

ప్రముఖ అమెరికన్ (American) టీవీ సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్‌’తో(Breaking Bad) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు ఆర్జే మిట్టే (RJ Mitte) 34 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్‌విల్లేలోని(Brownsville) తన నివాసంలో సోమవారం మరణించినట్లు అధికారులు, ఆయన ప్రతినిధులు వెల్లడించారు. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

కామెరాన్ కౌంటీ జస్టిస్ ఆఫ్ ది పీస్ సిండీ హినోజోసా (Cindy Hinojosa) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు ఆర్జే మిట్టే మరణించారు. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

2008 నుంచి 2013 వరకు ప్రసారమైన ‘బ్రేకింగ్ బ్యాడ్‌’లో(Breaking Bad) ఆర్జే మిట్టే, బ్రయాన్ క్రాన్‌స్టన్ పోషించిన వాల్టర్ వైట్ కుమారుడు వాల్టర్ వైట్ జూనియర్‌గా నటించారు. ఐదు సీజన్లలో దాదాపు అన్ని ఎపిసోడ్‌లలో కనిపించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ‘స్విచ్డ్ అట్ బర్త్’, ‘గార్డియన్స్ ఆఫ్ జస్టిస్’ వంటి సిరీస్‌లతో పాటు స్వతంత్ర చిత్రాల నిర్మాణంలోనూ పాల్గొన్నారు.

ఆర్జే మిట్టే నటుడిగానే కాకుండా దివ్యాంగుల హక్కుల కోసం పనిచేసిన కార్యకర్తగానూ గుర్తింపు పొందారు. ఆయనకు మూడేళ్ల వయసులో సెరిబ్రల్ పాల్సీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దివ్యాంగులపై ఉన్న అపోహలను తొలగించడం, వినోద రంగంలో వారికి సమాన అవకాశాలు కల్పించడం కోసం కృషి చేశారు. యునైటెడ్ సెరిబ్రల్ పాల్సీ, ష్రైనర్స్ చిల్డ్రన్స్ సంస్థలకు అంబాసిడర్‌గా పనిచేయడంతో పాటు, మిట్టే ఫౌండేషన్‌కు అధ్యక్షుడిగా సేవలందించారు.

ఆర్జే మిట్టే మరణవార్తతో టెలివిజన్ రంగంలో విషాదం నెలకొంది. ‘బ్రేకింగ్ బ్యాడ్‌’లోని వాల్టర్ వైట్ జూనియర్ పాత్రతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఆయన, దివ్యాంగుల హక్కుల కోసం చేసిన కృషితోనూ గుర్తుండిపోతారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment