---Advertisement---

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎప్పుడెక్కడ పోలింగ్? కీలక తేదీలివే!

October 14, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా(Anil Chandra Punetha) మున్సిపల్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు(Municipal Corporations), 77 మున్సిపాలిటీలు(Municipalities), 10 నగర పంచాయతీలు కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు (Urban Local Bodies) ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్‌

  • అక్టోబర్ 14న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.
  • అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ.
  • అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన.
  • అక్టోబర్ 28న పోలింగ్‌.
  • అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌

మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ)(MPTCs), జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ)(ZPTCs) ఎన్నికలకు అక్టోబర్ 19న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నవంబర్ 3న పోలింగ్‌ నిర్వహించి, నవంబర్ 5న ఫలితాలను ప్రకటించనున్నారు.

మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

గ్రామ పంచాయతీ ఎన్నికలను (Gram Panchayat Elections) మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 26న తొలి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్‌ జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను పోలింగ్‌ రోజునే ప్రకటించనున్నారు.

ఈ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల రూపకల్పనపై దృష్టి సారించనున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల పగ్గాలు దక్కించుకునేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియతో రాష్ట్రంలో రాజకీయ సందడి మరింత పెరిగే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment