---Advertisement---

ఇమ్రాన్ హష్మీకి షూటింగ్‌లో ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టి వ్యాన్‌పై పడిన కారు!

October 14, 2026

Summarize with AI

---Advertisement---

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) నటిస్తున్న ‘గన్‌మాస్టర్ జీ9’(Gunmaster G9) సినిమా షూటింగ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా, క్రేన్‌కు వేలాడదీసిన ఎస్‌యూవీ (SUV) గాల్లో పల్టీలు కొట్టి కింద పార్క్ చేసిన వ్యాన్‌పై పడింది. ఆ సమయంలో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో కౌంట్‌డౌన్ ముగియగానే ఎస్‌యూవీ గాల్లో తిరిగి తలకిందులుగా మారి వ్యాన్ పైకప్పుపై పడటం కనిపిస్తోంది. దీంతో చిత్రబృందం అప్రమత్తమైంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. అయితే, ప్రమాదంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆదిత్య దత్ (Aditya Datt) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీతో పాటు జెనీలియా దేశ్‌ముఖ్(Genelia D’Souza), అపారశక్తి ఖురానా(Aparshakti Khurana), అభిషేక్ సింగ్ (Abhishek Singh) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ ఈశ్వర్ అనే డెయిరీ ఫామ్ యజమానిగా కనిపించనున్నారు. తాను ప్రేమించే మహిళను రక్షించేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడే వ్యక్తిగా ఆయన పాత్రను రూపొందించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment